Navratri: న‌వ‌రాత్రుల్లో త‌ప్ప‌క పాటించాల్సిన నియ‌మాలు

4 things to follow during navratri

Navratri: న‌వ‌రాత్ర‌లు ఈరోజు నుంచే మొద‌లైపోయాయి. ఈ న‌వ‌రాత్రుల్లో నిష్ట‌గా పూజ చేసుకోవాల‌నుకునేవారు త‌ప్ప‌క పాటించాల్సిన నాలుగు నియ‌మాలున్నాయి. అవేంటంటే..

మొద‌టి నియ‌మం బ్ర‌హ్మ‌చ‌ర్యం. న‌వ‌రాత్రి దీక్ష చేప‌డుతున్న వారు క‌చ్చితంగా 9 రోజులు బ్ర‌హ్మ‌చ‌ర్యం త‌ప్పక పాటించాలి
రెండో నియ‌మం సాత్విక ఆహారం తీసుకోవ‌డం. వెల్లుల్లి, ఉల్లి వంటివి తిన‌కూడ‌దు. మాంసాహారాల‌కు దూరంగా ఉండాలి.
మూడోది భ‌గ‌వ‌న్నామ‌ర‌స్మ‌ర‌ణ‌. మీకు వీలున్న‌ప్పుడ‌ల్లా అమ్మ‌వారి మంత్రాల‌ను స్మ‌రించుకుంటూ ఉండాలి
నాలుగోది ఎవ్వ‌రినీ నొప్పించకూడ‌దు, బాధ‌పెట్ట‌కూడ‌దు. సాటి మ‌నిషిలో అమ్మ‌వారిని చూడ‌గ‌ల‌గాలి.
వీలైతే నేల‌పై చాప వేసుకుని ప‌డుకునేందుకు య‌త్నించండి.