KA Paul: పిచ్చి కుక్క‌లా వాగావ్.. 72 గంట‌ల్లో రాజీనామా చేయ్

ka paul asks konda surekha to resign in 72 hours

KA Paul: స‌మంత‌పై అభ్యంత‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ 72 గంట‌ల్లో మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్. రాజీనామా చేయ‌క‌పోతే సురేఖ‌ను మంత్రిగా డిస్‌క్వాలిఫై చేయాల‌ని కోర్టులో పిటిషన్ వేస్తాన‌ని అన్నారు. పిచ్చి కుక్క‌లా వాగిందంతా వాగేసి ఇప్పుడు సారీ చెప్తే స‌రిపోతుందా అని మండిప‌డ్డారు. ఇదే విధంగా ఓ వ్య‌క్తి చంపేసి సారీ చెప్తే ఊరుకుంటారా అని ప్ర‌శ్నించారు. ఆల్రెడీ ఈ వ్యాఖ్య‌ల వ‌ల్ల స‌మంత‌కు ఘోర అవ‌మానం జ‌రిగింద‌ని.. ఇలాంటివాళ్లు మంత్రి ప‌ద‌వుల్లో ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. గ‌తంలో రాహుల్ గాంధీ కూడా న‌రేంద్ర మోదీపై ఇలాగే వ్యాఖ్య‌లు చేస్తే కేసు వేసార‌ని.. దాంతో రాహుల్‌ను రాజ్య‌స‌భ నుంచి డిస్‌క్వాలిఫై చేసార‌ని అన్నారు. ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా చేయ‌క‌పోతే ఆమెకు కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు.