Konda Surekha: నేను వెనక్కి తగ్గను.. కేటీఆర్‌కి సారీ చెప్పను
Konda Surekha: ఎట్టి పరిస్థితుల్లోనూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని అన్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆరే తన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఇప్పుడు తనను క్షమాపణలు చెప్పమంటున్నాడని.. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని అన్నారు. కేటీఆర్ వ్యక్తిత్వం తెలియజేసే క్రమంలో కొందరు సినీ నటుల పేర్లు తీయాల్సి వచ్చిందని.. ఆ విషయంలో తాను క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. కానీ కేటీఆర్ విషయంలో తాను వెనక్కి తగ్గనని.. ఆయనకే తనకు క్షమాపణలు చెప్పాలని తెలిపారు.