Maruti: ఈ కారులోని పార్ట్ బంగారంతో స‌మానం… దొంగ‌ల క‌న్ను దీనిపైనే

this Maruti car part is equal to gold

Maruti: మారుతి కార్లు ఇండియాలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా బాగా ఫేమస్. చిన్న హ్యాచ్‌బ్యాక్స్ నుంచి పెద్ద పెద్ద SUVల వ‌ర‌కు అన్ని ర‌కాల కార్ల‌ను మారుతి లాంచ్ చేసింది. ప్ర‌తి కేట‌గిరీలోనూ మారుతి వాహ‌నాల‌కు మార్కెట్‌లో మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే మారుతికి చెందిన ఎకో కారు గురించి మ‌నం ఒక ముఖ్య‌మైన విష‌యం గురించి చెప్పుకోవాలి. ఈ మారుతి ఎకో కారు ఉన్న య‌జ‌మానులు ఒక స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నారు. ఈ కారు ఇంజిన్‌లోని ఓ భాగాన్ని కాపాడుకునేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఎందుకంటే ఆ భాగం బంగారంతో స‌మాన‌మైన‌ది. ఆఫ్ట్రాల్ కారు ఇంజిన్‌లోని భాగం బంగారంతో స‌మానం ఏంటి అనుకుంటున్నారా?

అయితే ఆ పార్ట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఇంజిన్‌లోని విలువైన భాగాన్ని కాటాలిటిక్ క‌న్వ‌ర్టర్ అంటారు. దీనిని ప‌ల్లాడియం, ప్లాటినం, రోడియం వంటి అత్యంత ఖ‌రీదైన మెట‌ల్స్‌తో త‌యారుచేస్తారు. ఈ మూడు మెటల్స్ చాలా విలువైన‌వి, అత్యంత ఖ‌రీదైన‌వి కూడా. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఈ మెట‌ల్స్‌కి ఉన్న డిమాండే వేరు.

కాటాలిటిక్ క‌న్వ‌ర్టర్ గురించి మ‌రిన్ని విశేషాలు

కారులోని ఎగ్జాస్ట్ సిస్ట‌మ్ నుంచి అధికంగా కాలుష్యం వెలువ‌డ‌కుండా ఈ క‌న్వ‌ర్ట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది

ఒక‌వేళ ఈ పార్ట్‌ను బ‌య‌ట అమ్ముకుంటే ఎంత కాద‌న్నా ల‌క్ష‌కు పైనే వ‌స్తుంది. దాంతో దొంగ‌ల భ‌యం ఎక్కువైంది.

ఈ క‌న్వ‌ర్ట‌ర్ కార్బ‌న్ మోనాక్సైడ్, నైట్రోజ‌న్ ఆక్సైడ్, హైడ్రోకార్బ‌న్స్ వంటి మూడు కీల‌క‌మైన వాయువుల‌ను బ‌య‌టికి రానివ్వ‌కుండా చేస్తుంది.