Thula Uma: KCR నాగార్జునకు నువ్వేమైనా బ్రోకర్ పనిచేసావా?
దాంతో ఉమ మీడియా ద్వారా సురేఖపై ఫైర్ అయ్యారు. “” హైడ్రా కారణంగా మేం బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే మా కార్లకు అడ్డుపడ్డారు. ప్రజా పాలన చేత కాక మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నువ్వే ఏడ్చేసి నువ్వే ఏదేదో చెప్పేస్తే అందరూ నమ్ముతారు అనుకుంటున్నావా? నువ్వొక్కదానికే ఆడదానివా? రకుల్, సమంత వంటి వారు ఆడవాళ్లు కారా? వారికి బాధ ఉండదా? అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వేమైనా కేటీఆర్‌కు నాగార్జునకు మధ్య బ్రోకర్‌గా ఉన్నావా? నీకు ఈ విషయాలు ఎలా తెలుసు. కేటీఆర్ రకుల్, సమంతలను రమ్మంటే వారు వెళ్లలేదని అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నావ్? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు “” అంటూ రెచ్చిపోయారు తుల ఉమ.