Vanitha Vijaykumar: నాలుగోసారి పెళ్లి పీట‌లెక్క‌నున్న న‌టి

vanitha vijaykumar fourth marriage

Vanitha Vijaykumar: ప్ర‌ముఖ న‌టి వనిత విజ‌య‌కుమార్ మ‌రోసారి పెళ్లి పీట‌లెక్కబోతున్నారు. ఇప్ప‌టికే ఆమెకు మూడుసార్లు పెళ్లైంది. ముగ్గురితోనూ విభేదాలు రావ‌డంతో ఆమె విడిపోయారు. ఇప్పుడు నాలుగోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌నున్నారు. త‌మిళ కొరియోగ్రాఫ‌ర్ రాబ‌ర్ట్‌తో వ‌నిత కొంత‌కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డిస్తూ రాబ‌ర్ట్ ముందు ఓ బీచ్‌లో మోక‌రిల్లి ప్ర‌పోజ్ చేస్తున్న ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇక నుంచి త‌న జీవితంలో మ‌ళ్లీ ఆనంద క్ష‌ణాలే రాబోతున్నాయ‌ని అక్టోబ‌ర్ 5న త‌న వివాహం ఘ‌నంగా జ‌ర‌గ‌నుంద‌ని అన్నారు.

ఇక్క‌డ మ‌రో షాకింగ్ విష‌యం ఏంటంటే.. రాబ‌ర్ట్, వ‌నిత 2013 నుంచే డేటింగ్‌లో ఉన్నారు. ప‌లు సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు. కానీ 2017లో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇద్ద‌రూ విడిపోయారు. మ‌ళ్లీ ఇప్పుడు క‌లుసుకుని త‌మ మ‌ధ్య ఉన్న విభేదాల‌కు స్వ‌స్తి ప‌లికి కొత్త జీవితాన్ని ఆస్వాదించ‌బోతున్నారు. 2000లో వ‌నిత ఆకాష్ అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు పుట్టాడు. ఆ త‌ర్వాత బాబు క‌స్ట‌డీ కోసం ఇద్ద‌రూ ఏళ్ల త‌ర‌బ‌డి పోరాడారు. 2007లో ఆనంద్ రాజ‌న్ అనే వ్యాపారవేత్త‌ను వివాహం చేసుకుని ఓ పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. 2012లో అత‌నితోనూ విడిపోయారు. 2020లో పీట‌ర్ పాల్ అనే విదేశీ ఫోటోగ్రాఫ‌ర్‌ను వివాహం చేసుకున్నారు. అత‌నితోనూ విడిపోయారు. గ‌తేడాదే పీట‌ర్ చ‌నిపోయారు కూడా.

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు విజ‌య్ కుమార్, న‌టి మంజుల‌ల కూతురే ఈ వ‌నిత‌. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె సొంత కుటుంబానికి దూరంగా ఉంటూ త‌న బ‌తుకు తాను గ‌డుపుతున్నారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా అన్నలు కానీ అక్క‌లు కానీ క‌నీసం ప‌ల‌క‌రించిన పాపాన పోలేద‌ని ప‌లుసార్లు ఇంట‌ర్వ్యూల్లో ఏడ్చి చెప్పుకున్నారు. గ‌తేడాది రిలీజ్ అయిన మ‌ళ్లీ పెళ్లి సినిమాలో వ‌నిత న‌టించారు. సీనియ‌ర్ న‌టుడు వీకే న‌రేష్ రెండో భార్య పాత్ర‌ను పోషించారు.