Srinu Vaitla: ఆగ‌డు నా కెరీర్‌లోనే పెద్ద త‌ప్పు

Srinu Vaitla says he regrets doing aagadu

Srinu Vaitla:  శ్రీను వైట్ల సినిమాల‌కు ఉన్న క్రేజ్ ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. వెంకీ, దుబాయ్ శ్రీను, దూకుడు, ఆగ‌డు వంటి సినిమాలన్నీ ఇప్పుడు మీమ్స్ రూపంలో జ‌నాలను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. అయితే త‌న కెరీర్‌లోనే తాను చేసిన అతిపెద్ద త‌ప్పు ఏద‌న్నా ఉందంటే అది మ‌హేష్ బాబుతో చేసిన ఆగ‌డు అని అంటున్నారు శ్రీను. తామిద్దరం అనుకున్న స్టోరీ వేర‌ని.. కానీ ప్రేక్ష‌కుల‌కు చూపించింది వేర‌ని అన్నారు. నిర్మాణ విలువ‌లు, పెట్టుబ‌డులు స‌రిగ్గా లేక‌పోవ‌డంతో అనుకున్న‌ట్లుగా సినిమా రాక దొబ్బంద‌ని అన్నారు. ఇప్పుడు గోపీచంద్‌తో విశ్వం సినిమాతో చాలా రోజుల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు శ్రీను. ఈ సినిమా కూడా ఒక వెంకీ, ఒక దుబాయ్ శ్రీనుగా చిర‌కాలం గుర్తుండిపోతుందేమో చూడాలి.