Rajinikanth: ఆల్ ఈజ్ వెల్
Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈరోజు తెల్లవారుజామున స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే ఆయన్ను అపోలోకి తరలించారు. ఈరోజు ఆయనకు ఎలెక్టివ్ ప్రొసీజర్ నిర్వహించనున్నారట. ఈ ప్రొసీజర్ ద్వారా ఉదర భాగంలోని రక్తనాళాన్ని పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో రజినీ భార్య లత స్పందించారు. ఆల్ ఈజ్ వెల్. భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు.