“నీవల్లే ఇది సాధ్యమవుతుంది సామ్​”

Hyderabad: సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం(Shaakunthalam) శుక్రవారం (ఏప్రిల్​ 14) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్టర్​ గుణశేఖర్()Gunashekar​ రూపొందించారు. ఈ మహాకావ్యంలో సమంత, దేవ్​ మోహన్​ జంటగా నటించారు. దిల్​ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా రిలీజై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంటున్న సందర్భంగా పలువురు ప్రముఖులు సమంత(Samantha)ను అభినందిస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్​2(Family Man2) దర్శకులు రాజ్​, డికే ట్విటర్​ వేదికగా సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం సమంత నటిస్తున్న సిటాడెల్(Citadel)​ ఇండియన్​ వెర్షన్​కి రాజ్​, డికేలు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ సమంతని ఉద్దేశిస్తూ ‘అద్భుతమైన విజువల్స్, చక్కని కథ, సినిమాలో ప్రతి ఫ్రేమ్​లో నీ అభినయం, కాళిదాసు రచించిన కళాఖండానికి ఇంతకంటే చక్కని రూపం ఉండదు. మీరు మాత్రమే ఇంత గొప్ప కథని మీ భుజాలపై మోయగలిగారు. సామ్, గత కొన్ని నెలలు మీకు అంత తేలికగా లేవని ప్రపంచానికి తెలుసు, అయినప్పటికీ మీరు సంకల్ప శక్తి, సంకల్పం, ధైర్యసాహసాలతో శక్తిని పొందారు. మీరు అధిగమించలేని అడ్డంకులను అధిగమించారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, బలంగా ఉండండి, పోరాటాన్ని కొనసాగించండి. చిత్రబృందానికి అభినందనలు. ప్రతి ఒక్కరూ తప్పక చూడండి’ అంటూ ట్వీట్​ చేశారు. ఇక, ఈ ట్వీట్‌పై సమంత(Samantha) స్పందిస్తూ.. ‘థాంక్యూ సో మచ్. నేను పడిపోయినప్పుడు కూడా మీరు నాకు అండగా ఉన్నారు… ఎప్పటికీ మీరు ది బెస్ట్’ అని రాసుకొచ్చారు.