AV Ranganath: మూసీ నది సర్వేతో మాకు సంబంధం లేదు
AV Ranganath: తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మూసీ నది కట్టడాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. మూసీ నదిపై ఉన్న క్యాచ్‌మెంట్ ఏరియాలను తాము సర్వే చేయలేదని.. ఆ సర్వేకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ అన్నారు. మూసీ నదిపై ఉన్న కట్టడాలను కూల్చివేయాలని కానీ అక్కడి స్థానికుల చేత ఇళ్లు ఖాళీ చేయించాలని హైడ్రా ప్లాన్‌లో లేదని స్పష్టం చేసారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వారు చూసుకుంటున్నారు కానీ హైడ్రాకు సంబంధం లేదని వెల్లడించారు.