Supreme Court On Tirumala Laddoo: చంద్ర‌బాబుకు సుప్రీంకోర్టు షాక్

Supreme Court On Tirumala Laddoo

Supreme Court On Tirumala Laddoo: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్‌కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా? అలా వినియోగించినట్లు ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. విచారణ జరగకుండానే లడ్డూ కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.

సీఎం ప్రజలకో వెళ్లి గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారైందన్నారు. TTD మాత్రం కల్తీ నెయ్యితో లడ్డూ తయారు కాలేదని చెబుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్యాఖ్యలు, TTD వాదనపై స్పష్టత కావాలి. FIR నమోదు కాకముందే సిట్ ఏర్పాటు కాకముందే కల్తీపై సీఎం ప్రకటన చేశారు. విచారణ పూర్తికాకముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ ప్రకటన చేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదు. దర్యాప్తు ప్రస్తుత SITతో కొనసాగాలా లేక… స్వతంత్ర దర్యాప్తు చేయించాలా అనేదానిపై త్వ‌ర‌లో స్పష్టత ఇస్తాం అని సుప్రీంకోర్టు వెల్ల‌డించింది.