Bandi Sanjay: హైడ్రాకి మ‌ద్ద‌తిచ్చి త‌ప్పు చేసా

bandi sanjay apologises for supporting hydraa

Bandi Sanjay: మొన్న‌టివ‌ర‌కు హైడ్రా సంస్థ మంచి ప‌ని చేస్తోంద‌ని తెగ పొగిడేసిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌… ఇప్పుడు హైడ్రాకి మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేసాన‌ని ప్లేటు మార్చారు. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మండిప‌డుతూ కూల్చివేత‌లు ఆప‌కపోతే స్టే ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని అన‌డంతో బండి సంజ‌య్ స్పందించారు. “” హైడ్రా మంచిది అనుకోని మద్దతు ఇచ్చినం కానీ ఇలా అయితదని అనుకోలేదు. మేము హైడ్రా మంచి ఆలోచనతో ఉంది, ప్రభుత్వం మంచి ప్లాన్ తో ఉంది కదా అనుకున్నాం. కానీ హైడ్రాతో పేద ప్రజల ఉసురు పోసుకుంటారని, పేదల పొట్ట కొడతారని, పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తారని అనుకోలేదు. హైడ్రాకి మ‌ద్ద‌తిచ్చి త‌ప్పు చేసా. న‌న్ను క్ష‌మించండి “” అని బండి సంజ‌య్ అన్నారు.