Sathyaraj: హీరో ముందు మోక‌రిల్లే పాత్ర‌లు ఇక చేయ‌ను

Sathyaraj says he does not act in a film where he has bend in front of a hero

Sathyaraj: ఇక తాను హీరోల ముందు మోక‌రిల్లే విల‌న్ పాత్ర‌ల్లో న‌టించ‌ను అని తేల్చి చెప్పేసారు విల‌క్ష‌ణ న‌టుడు సత్య‌రాజ్. ఆయ‌న కీల‌క పాత్ర‌లో న‌టించిన జీబ్రా సినిమా టీజర్ ఈరోజు లాంచ్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా స‌త్య‌రాజ్ మాట్లాడుతూ.. మిర్చిలో త‌న క్యారెక్ట‌ర్‌కి మంచి మార్కులు ప‌డ్డాయ‌ని… త‌న ఇమేజ్‌నే మార్చేసింద‌ని అన్నారు. ఇక బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప లాంటి పాత్ర‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌ని అన్నారు. అయితే తాను మాత్రం విల‌న్ పాత్ర‌లో న‌టించాల్సి వ‌స్తే.. హీరోల ముందు మోక‌రిల్లే పాత్ర‌లు మాత్రం అస్స‌లు చేయ‌ను అని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.