Devara: రాజమౌళికి దేవర నచ్చలేదా?
Devara: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా నచ్చలేదా? ఎందుకంటే.. నిన్న మీడియా వర్గాలు దేవర చూసారా సర్.. ఎలా ఉంది అని రాజమౌళిని అడగ్గా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారట. తారక్ అంటే రాజమౌళికి ఎంతో ఇష్టం. తారక్‌తో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసారాయన. అలాంటిది దేవర సినిమా గురించి ఆయన కామెంట్ చేయకపోవడంపై.. ఆయనకు సినిమా నచ్చలేదేమో అనే టాక్ ప్రచారంలో ఉంది.
రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి రిలీజ్ అయిన సోలో సినిమా ఇది. 24 ఏళ్లుగా రాజమౌళితో కలిసి పనిచేసే హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్‌ను దేవర బద్దలుకొట్టిందని దేవర రిలీజ్ రోజే రాజమౌళి కొడుకు కార్తికేయ స్పెషల్ ట్వీట్ వేసి మరీ చెప్పారు. మరి రాజమౌళి ఎందుకు దేవర గురించి స్పందించలేదో ఆయనే చెప్పాల్సి ఉంది.