యా యా ఏంటి? ఇదేమ‌న్నా కాఫీ షాపా?

supreme court cji slams a lawyer for using yeah yeah

Supreme Court: సుప్రీంకోర్టులో అనే కాదు.. ఏ కోర్టులో అయినా న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తులు స‌రైన, స‌ర‌ళ‌మైన‌ భాష‌లో మాట్లాడాలి. అది ఏ భాషైనా స‌రే. అంతేకానీ.. వాట్సాప్‌లో మాట్లాడుకున్న‌ట్లు షార్ట్ క‌ట్స్ వాడ‌టం.. పాష్ ఇంగ్లీష్ మాట్లాడితే వారి ఉద్యోగాలు ఊడిపోయే ప్ర‌మాదం ఉంటుంది. ఇలాంటి సంఘ‌ట‌నే భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో చోటుచేసుకుంది. అది కూడా భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ ఎదురుగా.

మ్యాట‌ర్ ఏంటి?

2018లో వేసిన పిటిష‌న్ గురించి ఓ న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపిస్తున్నారు. ఈ పిటిష‌న్‌లో మాజీ చీఫ్ జ‌స్టిస్ అయిన రంజ‌న్ గోగోయ్ పేరును రెస్పాండెంట్‌గా చేర్చారు. దీనిపై చంద్ర‌చూడ్ స్పందిస్తూ.. ఒక మాజీ జ‌డ్జిపైన పిల్ (ప‌బ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేష‌న్) వేయ‌డం స‌బ‌బు కాద‌ని ఆర్టికల్ 32 కింద ఈ పిటిష‌న్ స‌రైన‌దో కాదో చూసుకున్నారా అని స‌ద‌రు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించారు. దీనికి ఆ న్యాయ‌వాది స‌మాధానం ఇస్తూ.. యా యా అన్నారు. దాంత చంద్ర‌చూడ్‌కి ఒళ్లు మండింది. యా యా ఏంటి? మీరేమైనా కాఫీ షాప్‌లో ఉన్నారా? నాకు ఆ ప‌దాలంటేనే అలెర్జీ. స‌రిగ్గా మాట్లాడ‌టం నేర్చుకోండి అని తిట్టిపోసారు. అంతేకాకుండా పిటిష‌న్ నుంచి గోగోయ్ పేరు తొల‌గించాల‌ని.. జ‌డ్జిల‌పై పిటిష‌న్ల‌ను వేరే విధంగా ప‌రిష్క‌రించుకోవాలి కానీ పిల్ ద్వారా కాద‌ని అన్నారు.