Karnataka elections: సీఎంతో కాంతార హీరో ఫొటో.. కారణం అదేనా?
Bengaluru: కర్నాటకలో ఎన్నికల(karnataka elections) సమరం దగ్గర పడుతోంది. మరో 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో BJP ప్రతి అవకాశం ఉపయోగించుకుంటోంది. ముఖ్యంగా ఎన్నికల(elections) ప్రచారానికి సినీ గ్లామర్‌ను వాడుకుంటోంది. దాంతో కొందరు హీరోల అభిమానుల ఓట్లను దక్కించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటికే సినీ నటి సుమలత బీజేపీకి మద్దతు ప్రకటించారు. మరో సూపర్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా సీఎం బొమ్మై తరపున ప్రచారం చేస్తానని.. బొమ్మైని తాను మామ అని సంభోదిస్తానని తెలిపారు. ఇక తాజాగా కాంతార సినిమా డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టి కూడా సీఎం బసవరాజ్ బొమ్మైని కలవడం చర్చనీయాంశమైంది.
ఇవాళ ఉడిపిలో సీఎం బసవరాజ్ బొమ్మై(cm bommai), రిషబ్ శెట్టి(rishabh shetty) ఒకే ఆలయంలో ఒకేసారి పూజల్లో పాల్గొనడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఉడిపి జిల్లాలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని వీరు దర్శించుకున్నారు. అనంతరం సీఎం బొమ్మైతో కలిసి రిషబ్ శెట్టి ఫొటో దిగారు. దీంతో రిషబ్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కాంతార సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో స్టార్ అయిన రిషబ్ శెట్టికి కర్నాటకలోనూ మంచి పాపులారిటీ ఉంది. ఈక్రమంలో రిషబ్ శెట్టి, సీఎం బొమ్మైని కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే.. సీఎం బొమ్మైతో ఫొటో దిగిన వెంటనే రిషబ్ శెట్టి స్పందించారు. నో పొలిటికల్ కలర్ అంటూ ట్వీట్ వేశారు. కొల్లూరు మూకాంబిక దర్శనానికి వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రిని కలిశానని… ఇందులో ఎలాంటి రాజకీయం లేద అన్నారు. ప్రస్తుతం తాను కాంతారా-2 స్క్రిప్టు రచనలో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. ఇక ఇదే విషయమై సీఎం బొమ్మై కూడా మీడియాతో మాట్లాడారు. రిషబ్ తనకు మంచి స్నేహితుడని, ఆయన తమ భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రిషత్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు.