High Court: కూల్చివేతలు ఆపుతారా.. జైల్లో పెట్టమంటారా?
High Court: హైడ్రా సంస్థపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్లో అక్రమ కట్టడాల పేరిట కూల్చివేతలకు పాల్పడటంతో పిటిషన్ నమోదైంది. దీనిపై హైకోర్టులో వాదనలు జరుగుతుండగా… అమీన్పూర్లో ఎందుకు కూల్చివేతలకు పాల్పడ్డారు అని న్యాయమూర్తి అడిగారు. దీనికి ఏవీ రంగనాథ్ స్పందిస్తూ.. అమీన్పూర్ తహశీల్దార్ కోరడంతో యంత్రాలు, సిబ్బంది సమకూర్చాము అని సమాధానం ఇచ్చారు. దాంతో న్యాయమూర్తికి ఒళ్లు మండింది. రేపు ఇంకో ఎమ్మార్వో వచ్చి చార్మినార్ కూలగొడ్తా అంటే జేసీబీలు పంపిస్తారా? చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా? హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుంది. కూల్చివేతలు చేస్తున్న మీ అందరినీ చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తే వింటారు. కూల్చే టైమ్ ఉంది కానీ కోర్టు ఆర్డర్ చదివే టైమ్ లేదు. చేసిందంతా తప్పే మళ్లీ ఆర్గ్యూ ఎందుకు చేస్తున్నావు “” అంటూ ఎమ్మార్వోపై, రంగనాథ్‌పై హైకోర్టు మండిపడింది.