Ravindranath Reddy: జ‌గ‌న్ పాలిచ్చే ఆవు.. చంద్ర‌బాబు ఎగిరి త‌న్నే దున్న‌పోతు

Ravindranath Reddy compares chandrababu naidu to male buffalo

Ravindranath Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని దున్న‌పోతుతో పోలుస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌లు పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిరి త‌న్నే దున్న‌పోతును ఎన్నుకున్నారు అంటూ కామెంట్స్ చేసారు. సూప‌ర్ సిక్స్ అని ప్ర‌జ‌ల చేత ఓట్లేయించుకుని ఇప్పుడు ఆ హామీలు నెర‌వేర్చ‌లేక కాదంబ‌రి జ‌త్వానీ, తిరుమ‌ల ల‌డ్డూ, బోట్లు ఢీకొన్నాయి అంటూ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కి పాల్ప‌డుతున్నారని ఆరోపించారు. ఈ అంశాల‌తో ప్ర‌జ‌లు సూప‌ర్ సిక్స్ గురించి మ‌ర్చిపోతార‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ని.. కానీ ప్ర‌జ‌లకు నెల నెలా త‌మ‌కు జ‌గ‌న్ ఉంటే ఏదో ఒక ప‌థకం ద్వారా డ‌బ్బులు ఇచ్చేవార‌ని గుర్తుకొచ్చి సూప‌ర్ సిక్స్‌ని గుర్తుచేసుకుంటూ ఏడుస్తున్నార‌ని అన్నారు.