Karan Johar: ఎందుకు సర్ మీరంటే అందరికీ భయం?
Karan Johar: ఇటీవల ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లీగసీ అవార్డును అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ అవార్డును బాలయ్యకు ఇచ్చారు. ఆ తర్వాత ఈ వేడుకలో కరణ్ సరదాగా బాలయ్యను ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూలో బాలయ్య ఇచ్చిన సమాధానాలు ఇవే. ఈ ఇంటర్వ్యూను నన్ను రానా చేయమన్నాడు. ఏదన్నా తప్పు జరిగితే దాని బాధ్యత రానాదే అంటూ ఇంటర్వ్యూను మొదలుపెట్టారు కరణ్.
తొలిసారి జై బాలయ్య అనే డైలాగ్ ఎప్పుడు విన్నారు
నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ డైలాగ్ విన్నాను
అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన చెత్త గెస్ట్ ఎవరైనా ఉన్నారా?
నా షోకి వచ్చే ముందు వరకు అందరూ ఇంట్రోవర్టులే. ఒక్కసారి షోలో అడుగుపెట్టాక వారంత బెస్ట్ ఎవ్వరూ ఉండరు.
మీరంటే ఎందుకు భయపడతారు? ఇప్పుడు నేను కూడా భయపడుతున్నాననుకోండి
నన్ను ఎందరో అభిమానిస్తారు. కానీ ఒక్కోసారి వారు నాకు చిరాకు తెప్పిస్తారు. అప్పుడు నేను వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లలో మీకు ఎవరంటే ఇష్టం?
ముగ్గురు ఖాన్‌లలో ఎవరంటే ఇష్టం అంటే మీరేం చెప్తారు అని బాలయ్య కరణ్‌ను రివర్స్ ప్రశ్న వేయగా.. తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బాలయ్యను మీకు ఎవరంటే ఇష్టం అని అడగ్గా.. ఆ ముగ్గురూ లెజెండ్సే అని ఒకరి పేరు చెప్పడం కష్టం అని అన్నారు.