Ambati Rambabu: హోంమంత్రి తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారా?
Ambati Rambabu: తమ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తిరుమల వెళ్లాలంటే డిక్లరేషన్ అడుగుతున్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. ఇంతకీ ఆమె డిక్లరేషన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రాంబాబు. డిక్లరేషన్ అనేది అన్యమతస్థులు ఇచ్చేది. వంగలపూడి అనిత్ హిందూనే. కానీ అంబటి రాంబాబు ఎందుకు డిక్లరేషన్ అడుగుతున్నారు అని నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈనేపథ్యంలో ఓ నెటిజన్ ఈ కామెంట్స్‌కి స్పందిస్తూ.. ఓసారి అనిత స్వయంగా తాను క్రిస్టియన్‌నని చెప్పారని అందుకే డిక్లరేషన్ అడుగుతున్నారని తెలిపాడు. మరి దీనిపై అనిత ఎలా స్పందిస్తారో చూడాలి.