Netanyahu: భారత్ వరం.. ఇరాన్ శాపం
Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఐక్య రాజ్య సమితి (UN) వేదికగా చూపించిన రెండు దేశాల చిత్రపటాలు వైరల్‌గా మారాయి. ఐక్యరాజ్య సమితిలో గాజా యుద్ధం గురించి నెతన్యాహు మాట్లాడుతూ.. ఈ యుద్ధాలకు ప్రధాన కారణం ఇరానే అని వ్యాఖ్యానించారు. ఈ మాట చెప్తున్నప్పుడు ఆయన భారత్, ఇరాన్ చిత్రపటాలను చూపించారు. భారత్ మ్యాప్‌పై వరం అని.. ఇరాన్ మ్యాప్‌పై శాపం అని రాసుండటం వైరల్‌గా మారింది. నెతన్యాహు ఇలా చేయడం వల్ల ఇజ్రాయెల్‌కు అరబ్ దేశాలతో పెరుగుతున్న సంబంధాల గురించి తెలియజేసినట్లైంది. భారత్‌తో పాటు ఈజిప్ట్, సుడాన్, సౌదీ అరేబియా దేశాలను వరంగా.. ఇరాన్‌తో పాటు ఇరాక్, సిరియా, యెమెన్ దేశాలను శాపంగా చెప్పారు. ఇతర దేశాలు వరం కావాలో శాపం కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదే ఐక్యరాజ్య సమితి వేదికగా ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “” మీరు మాపై దాడి చేస్తే.. మేమూ చేస్తాం. ఇరాన్‌లో ఇజ్రాయెల్ వెళ్లలేని ప్రదేశం అంటూ లేదు “” అని హెచ్చరించారు నెతన్యాహు