Declaration: డిక్ల‌రేష‌న్ అంటే ఏంటి? ఇత‌ర మ‌తాల వారెందుకు పాటించాలి?

what is Declaration

Declaration: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం.. డిక్ల‌రేష‌న్. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో క‌ల్తీ జ‌రిగింద‌న్న సంచ‌ల‌న రిపోర్టు బ‌య‌టికి రావ‌డంతో ఇప్పుడు ఇత‌ర మ‌త‌స్థులు తిరుమ‌ల‌ను సంద‌ర్శించుకోవాలంటే డిక్ల‌రేష‌న్ ఫాం స‌మ‌ర్పించాల్సిందే అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొత్త రూల్‌ని తీసుకొచ్చింది. అస‌లేంటీ డిక్ల‌రేష‌న్? ఇత‌ర మ‌త‌స్థులు ఎందుకు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది? వంటి అంశాల‌ను తెలుసుకుందాం.

డిక్ల‌రేష‌న్ రూల్ అంటే ఏంటి?

హిందువు కాని భ‌క్తులు ఎవ‌రైనా తిరుమ‌ల‌ను ద‌ర్శించుకోవ‌చ్చు. కానీ వారు అలా తిరుమ‌ల‌ను ద‌ర్శించుకునే మందు త‌మ‌కు తిరుమ‌ల ప‌ట్ల‌, శ్రీవారి ప‌ట్ల భ‌క్తి, శ్ర‌ద్ధ‌, గౌర‌వాలు ఉన్నాయ‌ని తెలియ‌ప‌రుస్తూ సంత‌కం చేసి ఇచ్చే ఫాంనే డిక్ల‌రేష‌న్ అంటారు.

ఈ ఫాం ఎందుకు?

ఈ ఫాం ఎందుకంటే.. ఇత‌ర మ‌త‌స్థులు కూడా తిరుమ‌ల‌లో ఇత‌ర హిందువులు ఫాలో అయ్యే రూల్స్ ఫాలో అవ్వాల్సిందేన‌ని తెలియ‌జేసేందుకు.

ఈ రూల్ ఎప్ప‌టి నుంచి ఉంది?

ఇది TTD రూల్ 136 కింద 1990ల నుంచే అమ‌ల్లో ఉంది. బ్రిటిష్ పాల‌న స‌మ‌యంలోనూ ఈ రూల్‌ను పెట్టారు.

డిక్ల‌రేష‌న్ ఎప్పుడు స‌బ్మిట్ చేయాలి?

ద‌ర్శ‌నానికి వెళ్లే స‌మ‌యంలో వైకుంఠం కాంప్లెక్స్ క్యూ ద్వారా 17వ కంపార్ట్‌మెంట్‌లో ఈ డిక్ల‌రేషన్ ఫాం స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ డిక్ల‌రేష‌న్ ఎలా ప‌నిచేస్తుంది?

సామాన్య హిందువులు కాని భ‌క్తులైతే వైకుంఠం కాంప్లెక్స్‌లో ఈ ఫాం స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీఐపీల నుంచి మాత్రం వారుంటున్న క్వార్టర్స్ నుంచే అధికారులు క‌లెక్ట్ చేసుకుంటారు.

ఈ డిక్ల‌రేష‌న్ ఫాంపై ఒక‌ప్పుడు దివంగ‌త రాష్ట్ర‌ప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం కూడా సంత‌కం చేసారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఫాంపై సంత‌కం పెట్ట‌నిది సోనియా గాంధీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు మాత్ర‌మే. దాంతో సోనియా తిరుమ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని డిక్ల‌రేష‌న్ ఫాం స‌బ్మిట్ చేసి తిరుమ‌ల‌కు ర‌మ్మంటే త‌న మ‌తం మాన‌వ‌త్వం అని రాసుకుంటేనే డిక్ల‌రేష‌న్ ఇస్తాన‌ని అన‌డం వివాదాస్ప‌దంగా మారింది.