KGF 3 వ‌చ్చేస్తోంది..!

Karnataka: యశ్(Yash) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన కన్నడ సినిమా KGF. అంచనాలను మించి విజయం సాధించిన ఈ సినిమా సీక్వెల్​ KGF 2 పై భారీ అంచనాలు పెంచింది. అందుకు తగినట్టు  KGF 2 కూడా ఘన విజయం సాధించి కన్నడలో మాత్రమే కాకుండా దేశమంతటా ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్​తో రికార్డులు బ్రేక్​ చేసింది. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఇక ప్రశాంత్ నీల్ సెన్సేషనల్​ డైరెక్టర్​గా స్టార్​ హీరోలతో వరుస సినిమాలు లైన్లో పెట్టారు. ఈ సినిమా నిర్మించిన హోంబలే అతిపెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది.

KGF 2 సినిమా ఏప్రిల్ 14, 2022న రిలీజై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలై నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్​డేట్​ ఇచ్చారు నిర్మాతలు. KGF 3 పై రకరకాల వార్తలు వినిపించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా KGF 2 రిలీజై సంవత్సరం అయిన నేపథ్యంలో నిర్మాణసంస్థ ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో 1971 నుంచి 1981 వరకు రాఖీ భాయ్ ఏమైపోయాడు అనే ప్రశ్న వేసి, చివర్లో రాఖీ భాయ్ ప్రామిస్ ఇచ్చాడు, ప్రామిస్ తీరుస్తాడు అని KGF 2 సినిమాలోని చివరి సీన్ KGF 3 అని చూపించే షాట్ వేసి 3 అని వేశారు. దీంతో KGF 3 రాబోతోందని సంబరపడుతున్నారు అభిమానులు.