విమానంలో సెక్స్.. దించేసిన సిబ్బంది

sex in flight lands couple in court

Flight: ఓ జంట విమానంలోనే ప‌ని కానిచ్చేయాల‌నుకున్నారు. తోటి ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌న్న ఇంగిత‌జ్ఞానం లేకుండా వారు ప్ర‌వ‌ర్తించ‌డంతో విమాన సిబ్బంది వారిని దించేసారు. బ్రిట‌న్‌కి చెందిన స్మిత్, ఆంటోనియా అనే జంట ఈజీ జెట్ విమానంలో స్పెయిన్ నుంచి బ్రిట‌న్‌కు వెళ్తున్నారు. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రూ కోట్ కప్పుకుని మ‌రీ పాడుప‌ని చేయాల‌నుకున్నారు.

వారిద్ద‌రి వెన‌క సీటులో ఓ చిన్న పిల్ల‌తో ఉన్న త‌ల్లి, ప‌క్క‌న సీటులో ఇద్దరు మ‌గ‌వాళ్లు ఉన్నారు. వారికి ఇబ్బంది క‌లుగుతుండ‌డంతో వెంట‌నే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసారు. ఇదేం ప‌ని అని వారు ప్ర‌శ్నించ‌గా.. త‌న ప్రియుడికి కాలు నొప్పిగా ఉందంటే నొక్కుతున్నాన‌ని.. తప్పుగా అర్థంచేసుకుంటున్నార‌ని బుకాయించారు. దాంతో విమానాన్ని అత్యవ‌స‌ర ల్యాండింగ్ చేయించి మ‌రీ వారిని మార్గ‌మ‌ధ్య‌లో దించేసారు. పోలీసుల‌కు అప్ప‌గించారు. స్మిత్, ఆంటోనియోని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా.. వారి వ‌ల్ల తీవ్ర ఇబ్బందికి గ‌రైన ముగ్గురు ప్ర‌యాణికుల‌కు చెరో 100 పౌండ్లు ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది. అంత‌కాదు. ఇద్ద‌రూ 270 గంట‌ల పాటు కమ్యూనిటీ సెంట‌ర్ల‌లో ప‌ని చేయాల‌ని చెప్పింది.