పోలీస్ ఎస్కార్ట్‌తో డిప్యూటీ సీఎం కొడుకు రీల్స్
Rajasthan: రాజకీయనాయకుల కొడుకులు పోలీసులను ఎస్కార్ట్‌గా పెట్టుకుని మరీ రీల్స్ చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారి తీసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ భైర్వా కొడుకు అషు.. కాంగ్రెస్ నేత పుష్పేంద్ర భరద్వాజ్ కొడుకు కార్తికేయతో కలిసి జీపుని నడుపుతున్నట్లు రీల్స్ చేసాడు. ఈ రీల్ చేస్తున్న సమయంలో తమ వెంట పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు కూడా ఉన్నాయి. దాంతో స్థానికులు వీడియో తీసి వైరల్ చేసారు. అధికారం ఇస్తే ఇలా దుర్వినియోగం చేసుకుంటూ రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు అంటూ రచ్చచేసారు.
దీనిపై భైర్వా స్పందించారు. తన కొడుకు అషు మైనర్ అని.. డిప్యూటీ సీఎం కొడుకు కాబట్టే ఇంత రచ్చ చేస్తున్నారని అన్నాడు. తన కుమారుడితో పాటు ఉన్న మరో ఇద్దరు అబ్బాయిలు స్కూల్ ఫ్రెండ్స్ అని.. తాను ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి తన కుమారుడిని తమ కారులో ఎక్కించుకుని వెళ్లారని లాజిక్ లేకుండా సమాధానం ఇచ్చారు. ఈ రీల్‌ను సోషల్ మీడియాల పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత కుమారుడు కార్తికేయ.. రాజకీయాలైనా.. రోడ్లైనా మేం ముందుకుపోతూనే ఉంటాం అని క్యాప్షన్ ఇవ్వడం మరింత వివాదానికి దారి తీసింది.