SS Karthikeya: 23 ఏళ్ల అపోహ బద్దలైపోయింది!
SS Karthikeya: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమైళితో ఏ హీరో అయినా సినిమా చేస్తే ఆ తర్వాత ఆ హీరో చేసే మరో సినిమా ఫ్లాప్ అవుతుంది అనే ఓ సెంటిమెంట్ ఉంది. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్.. కాదు కాదు అపోహ బద్దలైపోయింది. RRR తర్వాత తారక్ నటించిన దేవర ఈరోజు రిలీజ్ అయ్యి అప్పుడే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది.
ఈ నేపథ్యంలో రాజమౌళి కొడుకు కార్తికేయ బ్లాక్‌బస్టర్ ట్వీట్ పెట్టాడు. “” 23 ఏళ్ల అపోహ బద్దలైపోయింది. ఎవరితో అయితే ఆ అపోహ మొదలైందో.. అతనే ఈరోజు దానిని బద్దలుకొట్టేసాడు . తనని చూస్తూ పెరిగిన నేను ఈరోజు తను చేస్తే అద్భుతాలను చూస్తున్నాను. అందుకే అతను తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో స్పెషల్. మాటలు రావడంలేదు. ఈ విషయం అరుస్తూ చెప్పాలని ఉంది “” అని ట్వీట్ చేస్తూ తారక్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసాడు.