రత‌న్ టాటా నిర్మించిన ఏకైక అతిపెద్ద ఫ్లాప్ సినిమా

ratan tata produced this flop cinema

Ratan Tata: ర‌త‌న్ టాటా భార‌త‌దేశంలోనే అత్యంత స‌క్సెస్‌ఫుల్ వ్యాపార‌వేత్త అని మ‌న‌కు తెలిసిందే. ఆయ‌న త‌న వ్యాపారాన్ని మొద‌లుపెట్టాల‌నుకున్న‌ప్ప‌టి నుంచి ప‌ట్టింద‌ల్లా బంగారంలా సాగేది. ఇప్ప‌టికీ టాటా కంపెనీకి ఉన్న విలువ ఇసుమంతైనా త‌గ్గ‌లేదు.. త‌గ్గ‌దు కూడా. అయితే.. పాపం ర‌త‌న్ టాటాకు అన్ని రంగాల్లో వ్యాపారాలు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు సినిమాలను నిర్మించ‌డం అంటే ఎంతో ఇష్టం ఉండేది. అలా త‌న నిర్మాణ సంస్థ అయిన టాటా ఇన్ఫోమీడియా బ్యాన‌ర్‌పై ఏత్‌బార్ అనే హిందీ సినిమాను తీసారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమాకు విక్ర‌మ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జాన్ అబ్ర‌హం, అమితాబ్ బ‌చ్చ‌న్, బిపాషా బ‌సులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా రూ.9 కోట్ల బ‌డ్జెట్‌తో తీసారు టాటా. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. రూ.9 కోట్లు పెట్టి తీస్తే రూ.7 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. కానీ ఈ సినిమాలో న‌టించిన వారంతా ఆ త‌ర్వాత సూప‌ర్‌స్టార్లుగా ఎదిగారు. ఇక అప్ప‌టి నుంచి తాను సినిమాలు నిర్మించ‌కూడ‌ద‌ని టాటా నిర్ణ‌యించుకున్నారు.