Putin: అదే జ‌రిగితే క్షిప‌ణులు వ‌ద‌ల‌డ‌మే

putin warns of using nuclear weapons

Putin: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ మ‌రోసారి మిస్సైల్ దాడుల గురించి హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. ఉక్రెయిన్ మ‌రోసారి మిస్సైల్, డ్రోన్, వైమానిక దాడుల‌కు పాల్ప‌డితే తాను క్షిప‌ణులు వ‌దలాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాదాల‌ను దృష్టిలో పెట్టుకుని ర‌ష్యా త‌న క్షిప‌ణి పాల‌సీలో మార్పులు తీసుకొస్తోంది. ఈసారి అమెరికా, బ్రిట‌న్ అనుమ‌తుల‌తోనే క్షిప‌ణి దాడికి పాల్ప‌డేలా చ‌ర్యలు తీసుకుంటోంది. ర‌ష్యాపై కానీ త‌న మిత్ర దేశం బెలార‌స్‌పై కానీ ఎవ‌రైనా దాడుల‌కు పాల్ప‌డాల‌ని చూస్తే క్షిప‌ణుల‌కు ప‌నిచెప్తాన‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసారు.

ప్ర‌స్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న ర‌ష్యా ఎక్క‌డ క్షిప‌ణి దాడికి పాల్ప‌డుతుందో అని అమెరికా కంగారుప‌డుతోంది. క్యూబా మిస్సైన్ సంక్షోభం త‌ర్వాత అంత‌టి దారుణంగా యుద్ధం జ‌రిగేది ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్యే. ఇది కాస్తా క్షిప‌ణి దాడుల‌కు దారి తీయ‌కుండా ఉంటే చాలు దేవుడా అని మొక్కుకోని దేశం లేదు. మ‌రోప‌క్క ర‌ష్యాపై త‌గ్గేదేలే అన్న‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌వ‌ర్తిస్తోంది. రష్యాపై దాడుల‌కు పాల్ప‌డేందుకు ప‌శ్చిమ దేశాలు త‌మ‌కు మిస్సైల్స్ స‌ర‌ఫ‌రా చేస్తే బాగుంటుంద‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్‌కు మ‌ద్దతు ఇస్తే ఆ దేశం ప‌రిస్థితి ఏంటో పుతిన్ ఏం చేస్తాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పొర‌పాటున ఉక్రెయిన్‌పై జాలి ప‌డి ఏ దేశ‌మైనా మిస్సైల్స్ దానం చేసిందంటే.. మూడో ప్ర‌పంచ‌యుద్ధ‌మే అని పుతిన్ ఆల్రెడీ క‌న్ఫామ్ చేసేసారు. దాంతో ప‌శ్చిమ దేశాలు చూస్తూ ఉండ‌టం త‌ప్ప ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. ఈ ప్ర‌పంచంలో ప‌వ‌ర్ బ్యాలెన్స్ చేయాలంటే ర‌ష్యా క్షిప‌ణులను ప్ర‌యోగించ‌క త‌ప్ప‌ద‌ని పుతిన్ అభిప్రాయ‌పడ్డారు.