Byjus: 15 వేల కోట్ల అప్పు.. BCCI అప్పు తీర్చి తప్పించుకునేందుకు యత్నం
Byjus: లాక్డౌన్ సమయంలో ఏ ప్రకటన చూసినా బైజూస్ బైజూస్ బైజూస్. పైగా షారుక్ ఖాన్ లాంటి అగ్ర హీరోను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడంతో ఈ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ వేల కోట్ల లాభాలను చవిచూసింది. కోవిడ్ నెమ్మదిగా ముగిసే సమయానికి బైజూస్ పతనం మొదలైంది. బహుశా మన దేశంలో అతి తక్కువ సమయంలోనే కోట్ల లాభాలు చూసి ఆ వెంటనే దివాలా తీసిన కంపెనీ బైజూసే కాబోలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, ఇతర సంస్థల నుంచి తీసుకున్న ఫండ్స్ తిరిగి ఇవ్వలేక బైజూస్ ఛైర్మన్ రవీంద్రన్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బైజూస్ కంపెనీకి ఉన్న అప్పు రూ.15000 కోట్లు.
ఈ అప్పులు తీర్చే అంశాన్ని NCLAT (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) చూస్తోంది. ఈ నేపథ్యంలో బైజూస్ కంపెనీ చేత BCCI సంస్థకు రూ.150 కోట్లు చెల్లించేలా చేసింది. ఎందుకంటే బైజూస్ BCCIకి కూడా అప్పుంది. ఆ అప్పు చెల్లించేసాక ఇక బైజూస్ తీర్చాల్సిన అప్పులు ఏమీ లేవు అన్నీ క్లియర్ అయిపోయినట్లే అని NCLAT తేల్చేసింది. దాంతో బాకీలు పడ్డ ఇతర సంస్థలు షాకయ్యాయి. బైజూస్ అమెరికాకు చెందిన గ్లాస్ ట్రస్ట్ అనే కంపెనీకి కూడా అప్పు చెల్లించాల్సి ఉంది. దాంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆదేశించింది. ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు NCLATపై ఆగ్రహం వ్యక్తం చేసారు. “” 150 కోట్లు బీసీసీఐకి కట్టేస్తే క్లియర్ అయిపోయినట్లేనా? మరి 15000 కోట్ల అప్పులో మిగతా డబ్బు ఎవరు కడతారు? కాస్త బుర్ర వాడండి “” అని మండిపడింది. దాంతో ఈ కేసును మళ్లీ NCLATకే అప్పగించింది.