Chimpanzee: పసికందుని ముక్కలుగా నరికేసిన చింపాంజీ
Chimpanzee: చింపాంజీ ఏంటి.. పసికందుని ముక్కలుగా నరకడం ఏంటి అనుకుంటున్నారా? ఇది నిజంగానే జరిగింది. అది కూడా ఏదో ఓ సాధారణ చింపాంజీ చేసిన పని కాదు ఇది. ఓ ఫేమస్ చింపాంజీ పని. అసలేం జరిగిందంటే..గునియాలోని బోస్సో అనే ప్రాంతంలో జేజే అనే ఓ చింపాంజీ ఉంది. ఇది అక్కడ చాలా ఫేమస్. ఎందుకంటే ఇది గింజలను, నట్స్ని రాళ్లతో, పరికరాలతో కొట్టి తినడం చూసి దాని తెలివితేటలకు తెగ ఆశ్చర్యపోయారు.
అయితే ఇది జూలో ఉండే చింపాంజీ కాదు. ఇది అక్కడి అడవుల్లో తిరుగుతూ ఉండేది. అయితే.. మూడు నెలల క్రితం స్థానిక కస్సావా పొలాల్లో సెనీ అనే యువతి తన 8 నెలల బిడ్డను నడుముకు చుట్టుకుని పనిచేస్తుండగా.. ఈ జేజే చింపాంజీ కంటపడింది. తెలిసిన జీవే కదా అని సెనీ తన పని తాను చేసుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా ఆ చింపాంజీ సెనీ నుంచి బిడ్డను లాక్కునేందుకు యత్నించింది. సెనీ తన బిడ్డను రక్షించుకునేందుకు పాకులాడుతుండగా ఆ చింపాంజీ చేతిని కొరికేసింది. అలా బిడ్డను తీసుకుని పారిపోయింది.
సెనీ స్థానికులకు విషయం చెప్పగా.. వారంతా గాలించే పనిలో పడ్డారు. కస్సావా పొలాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ పసికందు మృతదేహం కనిపించింది. ఆ చింపాంజీ పసికందును ఎంత దారుణంగా చంపేసిందంటే.. ఆ పసికందు కూడా తినేదేనేమో అనుకుని పరికరాలతో కొట్టి కొట్టి చంపేసింది. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కస్సావా పొలాల చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కేవలం ఆరు చింపాంజీలు మాత్రమే ఉన్నాయి. వాటిని స్వేచ్ఛగా వదిలేయాన్న ఉద్దేశంతో జూలో పెట్టించలేదని అధికారులు చెప్తున్నారు.