Prakash Raj: చేయ‌ని త‌ప్పుకి సారీ చెప్పించుకోవడ‌మేంటి ప‌వ‌న్?

prakash raj satire on pawan kalyan

Prakash Raj: తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సినీ న‌టులు ప్ర‌కాష్ రాజ్, కార్తిల‌పై మండిప‌డ్డారు. ల‌డ్డూలో క‌ల్తీ జ‌రిగితే విచార‌ణ చేయించ‌కుండా మ‌త‌క‌ల‌హాలు ఎందుకు సృష్టిస్తున్నారంటూ ప్ర‌శ్నించిన ప్ర‌కాష్ రాజ్‌ని… స‌త్యం సుంద‌రం సినిమా ఈవెంట్‌లో ల‌డ్డూ గురించి ఇప్పుడు మాట్లాడ‌కూడ‌దు.. ఇది సున్నిత‌మైన అంశం అని న‌వ్వుతూ చెప్పిన కార్తిని ఏకిపారేసారు ప‌వ‌న్. తిరుమ‌ల అంటే అంత చిన్న చూపా అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. దాంతో కార్తి వెంట‌నే ప‌వ‌న్‌కు సారీ చెప్ప‌డం.. ఆ త‌ర్వాత క్ష‌మిస్తున్నాను అంటూ ప‌వ‌న్ రిప్లై ఇవ్వ‌డం జ‌రిగిపోయాయి.

ఈ నేప‌థ్యంలో చేయ‌ని త‌ప్పుకు సారీ చెప్పించుకోవ‌డంలో ఉన్న ఆనంద‌మేంటో అంటూ ప్ర‌కాష్ రాజ్ ప‌వ‌న్‌పై సెటైర్లు వేసారు. ప్ర‌స్తుతం షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్న ప్ర‌కాష్ రాజ్‌.. ఈ నెల 30న వ‌చ్చి ప‌వ‌న్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్తాన‌ని అన్నారు.