Jayam Ravi: భార్య గెంటేసిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు

jayam ravi police complaint on ex wife aarti

Jayam Ravi: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు జ‌యం ర‌వి వ్య‌క్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవ‌ల తాను త‌న భార్య ఆర్తితో విడిపోతున్న‌ట్లు జ‌యం ర‌వి ప్ర‌క‌టించారు. ఆ మ‌రుస‌టి రోజే.. ఆర్తి షాకింగ్ పోస్ట్ పెట్టారు. త‌న అనుమ‌తి లేకుండానే విడాకుల ప్ర‌క‌ట‌న జ‌రిగింద‌ని.. ర‌వితో ఉండాల‌ని తానెంతో కోరుకున్నాన‌ని కానీ ర‌వి మాత్రం వినిపించుకోకుండా త‌న అనుమ‌తి లేకుండా విడాకులు ఇచ్చేసాడ‌ని ఆరోపించింది.

అంతేకాదు.. జ‌యం ర‌వి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ని కూడా ఆర్తినే చూసుకునేది. అయితే.. త‌న‌కు త‌న ఇన్‌స్టా యాక్సిస్ ఇవ్వాల‌ని జ‌యం ర‌వి కోర‌గా.. ఆర్తి అస్స‌లు ఒప్పుకోలేదు. దాంతో త‌న టీంతో మెటాకు లెట‌ర్ రాయించి మ‌రీ త‌న యాక్సెస్‌ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు మ‌రో షాకింగ్ అంశం ఏంటంటే.. త‌మిళ‌నాడులోని అడ‌యార్ పోలీస్ స్టేష‌న్‌లో జ‌యం ర‌వి ఆర్తిపై కేసు పెట్టాడు. త‌న‌ను ఇంట్లో నుంచి గెంటేసింద‌ని.. ఆ ఇంట్లో ఉన్న త‌న వ‌స్తువులు త‌న‌కు ఇప్పించాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.