Lifestyle: బిడ్డ పుట్టాక ఒకర్నొకరం మోసం చేసుకుంటున్నాం
Lifestyle: పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది అంటారు. ఇది కొందరికి మాత్రమే వర్తించినా.. ఆ కొందరిలో నేనూ నా భార్యా ఉన్నాం. మాకోసం మేం సమయం ఇచ్చుకుని కొన్నేళ్లు అవుతోందంటే నమ్ముతారా? మా బిడ్డను మేం బాగానే చూసుకుంటాం. కానీ మా మధ్య దూరం పెరిగింది. దాంతో నేను ఆ సుఖాన్ని “బయట” వెతుక్కున్నాను. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. నా భార్య కూడా అదే చేస్తోంది. ఈ విషయం మా పెద్దలకు తెలిస్తే తట్టుకోలేరు. ఏం చేయమంటారు?
నిపుణుల సలహా
బిడ్డ పుట్టాక మీ మధ్య దూరం ఏర్పడింది అంటున్నారు. మీ బిడ్డ వయసు ఎంతో చెప్పలేదు. సాధారణంగా పిల్లలు పుట్టిన ఒక ఏడాది వరకు వారి వెంటే నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీలును బట్టి ప్లే స్కూల్‌లో వేస్తుంటారు. మరి ఈ విషయంలో మీరేం చేసారు? కనీసం ఒక్కసారి కూడా మీరు మీ భార్య కలిసి కూర్చుని మనసారా మాట్లాడుకోవడం వంటివి చేయలేకపోయారా? పైగా ఇద్దరూ ఎవరి దార్లు వారు చూసుకున్నాం అంటున్నారు. దాని అర్థమేంటి? ఇదెంత తప్పో మీకు తెలుసా. మీ ఇంట్లో పెద్దలకు తెలిస్తే తట్టుకోలేరు అంటున్నారు. మీ బిడ్డకు రేపో మాపో తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా? ఇప్పటికైనా ఈ “బయటి” బంధాలకు స్వస్తి పలకండి. మీలాంటి వారి కోసమం ఎన్నో కౌన్సెలింగ్, థెరపీ సెంటర్లు ఉన్నాయి. వీలైతే ఒకసారి సంప్రదించండి.