KTR: దేవర ఈవెంట్ కూడా నిర్వహించడం రాలేదు రేవంత్‌కి
KTR: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంపై స్పందించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక సినిమా ఈవెంట్ నిర్వహించడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో చిన్న పండుగలు వచ్చినా, ఈవెంట్లు ఉన్నా, ఫార్ములా కారు రేసులు, నిమజ్జనాలు ఉన్నా అన్ని శాఖల వారు అప్రమత్తంగా ఉండేవారని.. ట్రాఫిక్‌కి కూడా అంతరాయం కలిగించకుండా.. ఎలాంటి పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా చూసుకునేవాళ్లం అని అన్నారు.
మొన్న ఆదివారం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగాల్సి ఉంది. హైదరాబాద్‌లోని నొవోటెల్ హోటల్లో ఈ వేడుకను నిర్వహించగా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసారు. ఇందుకు కారణం పోలీసు బందోబస్తు తక్కువగా ఉండటం.. అదే సమయానికి నొవోటెల్ నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న ట్రైడెంట్ హోటల్లోనే రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొనడం. ఈవెంట్‌కి ఇచ్చిన పాసులు 4000 అయితే.. 35 వేల మంది అభిమానులు వచ్చేసి నానా రచ్చ చేసారు. గేట్లు, బ్యారికేడ్లు పగలగొట్టి హోటల్ ప్రాపర్టీని ధ్వంసం చేసారు. దాదాపు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని నొవోటెల్ సంస్థ వెల్లడించింది.