HDFC Bank: ఆఫీస్‌లో బ్యాంక్ ఉద్యోగి అనుమానాస్ప‌ద మృతి

HDFC Bank employee dies in office

HDFC Bank: ఇటీవ‌ల జ‌రిగిన ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ కంపెనీలోని ఓ 26 ఏళ్ల ఉద్యోగి ప‌ని ఒత్తిడి భ‌రించ‌లేక చ‌నిపోయిన ఘ‌టన మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. HDFC బ్యాంక్‌లో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగిని అనుమానాస్ప‌ద మృతిచెందింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖ్‌నౌకి చెందిన 45 ఏళ్ల స‌ద‌ఫ్ అనే ఉద్యోగిని ఆఫీస్‌కి వెళ్లి త‌న కుర్చీలో కూర్చుని ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయింది. ఆమెను వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. దాంతో బ్యాంక్ ఉద్యోగులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పోస్ట్‌మార్టెం చేయిస్తే త‌ప్ప మృతికి గ‌ల కార‌ణాలు తెలీవ‌ని పోలీసులు చెప్తున్నారు. మ‌రోప‌క్క స‌దఫ్ తోటి ఉద్యోగులు కొంత‌కాలంగా ఆమెపై ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంద‌ని చెప్తున్నారు.