Yogeshwar Dutt: పతకం దొబ్బెట్టిందే కాకుండా దొంగ ఏడుపా?
Yogeshwar Dutt: లండన్ ఒలింపిక్ రజత పతక విన్నర్, ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ వినేష్ ఫోగాట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్ నుంచి వినేష్ డిస్మిస్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె సెమీ ఫైనల్స్ వరకు వచ్చినందుకు గానూ జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని కేసు వేసినా తీర్పు అనుకూలంగా రాలేదు. దాంతో ఇక తాను పోరాడలేనని.. రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నానని వినేష్ కన్నీరుపెట్టుకుంది.
ఈ ఘటనపై యోగేశ్వర్ దత్ స్పందించారు. “” వినేష్ ఫోగాట్ చేసిందే వెధవ పని. 100 గ్రాములు అధికంగా ఉన్నందుకు ఆమెను డిస్మిస్ చేసారు. ఆ 100 గ్రాముల రూల్ అనేది నరేంద్ర మోదీ పెట్టింది కాదు కదా? అదే ఒలింపిక్ రూల్ అని తెలీదా? మరి దేశాన్ని, దేశ ప్రధానిని ఎలా అవమానిస్తుంది. రూల్స్ ఫాలో కాకుండా తప్పులు చేసి భారత్‌కు రావాల్సిన పతకం దొబ్బెట్టిందే చాలక మళ్లీ మోసం జరిగింది అంటూ భారతదేశం గురించి పారిస్‌లో తక్కువ చేసి మాట్లాడింది. దొంగ ఏడుపులు ఏడ్చింది. నేను వినేష్ స్థానంలో ఉండి ఉంటే నా తప్పుకు క్షమాపణలు చెప్పి వెనక్కి వచ్చేసేవాడిని “” అంటూ మండిపడ్డారు.