Pawan Kalyan: నేను చావడానికైనా సిద్ధం.. ప్రకాష్ రాజ్‌పై ఆగ్రహం
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో ఎందుకు మతతత్వ కలహాలు జరిగేలా పెద్ద వివాదం సృష్టిస్తున్నారు అంటూ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌కు ట్వీట్ చేసారు. దీనిపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
“” నేను నా మతం గురించి మాట్లాడుతున్నా ప్రకాష్ రాజ్ గారూ. మీ గురించి నేనెక్కడ మాట్లాడాను. అసలు ఈ విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు. ఇదే ఏ మసీదులో చర్చిలో జరిగితే చూస్తూ ఊరుకుంటారా? ప్రతి ఒక్కడికి హిందూ ధర్మం అంటే ఎగతాళి అయిపోయింది. నాకు మీరంటే గౌరవం ఉంది ప్రకాష్ రాజ్ గారూ. దయచేసి ఆ గౌరవాన్ని చెడగొట్టుకోకండి. ప్రతి ఒక్కడికి హిందూ ధర్మం అంటే జోక్ అయిపోయింది. కానీ మాకు అలా కాదు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేం పోరాడతాం. హిందూ ధర్మం గురించి మాట్లాడితే నడిరోడ్డు మీదకు లాగుతాం
పొన్నవోలు సుధాకర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పంది కొవ్వు నెయ్యి కంటే ఖరీదైనదని.. అంతటి ఖరీదైనదాన్ని నెయ్యిలో ఎలా కలుపుతారు అంటూ పంది కొవ్వు గొప్పతనం గురించి చెప్తున్నారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లి మేం తప్పు చేసి ఉంటే నాశనం అయిపోతాం.. నోటి నుంచి రక్తం కారి చచ్చిపోతాం అంటున్నారు. మొదటికి ఆల్రెడీ మొదలైంది. ఇక రెండోది దేవుడికి వదిలేస్తున్నా. ఇక వైవీ సుబ్బారెడ్డి విచారణకు రమ్మంటే రికార్డులు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు రికార్డులు ఇచ్చారా? విచారణకు సిద్ధం కండి.
ఇక ధర్మారెడ్డి గాయబ్ అయిపోయారు. కొడుకు చనిపోతే వారం రోజుల్లోనే ఆలయంలో అడుగుపెట్టేసారు. ఇదేనా హిందూ సంప్రదాయం. ప్రభుత్వ అధికారి అయినంత మాత్రాన ఆచారాలు, సంప్రదాయాలు మారిపోతాయా? జగన్‌కి కూడా చెప్తున్నా.. నేనే గనక సనాతన ధర్మంపై పోరాటం చేయాలనుకుంటే నేను చావడానికి సిద్ధం. కానీ నేను అక్కడిదాకా తీసుకెళ్లాలనుకోవడం లేదు. మీ వల్లైతే హిందువులు ముందుకొచ్చి మాకు మద్దతు తెలపండి. లేదంటే ఇంట్లో కూర్చోండి. అంతేకానీ దరిద్రంగా కామెంట్స్ చేయద్దు. ఇవే కామెంట్స్ ఇస్లాం మీద చేస్తే వాళ్లు నడిరోడ్డుపై కొడతారని మీకు భయం. కానీ హిందువులు శాంతంగా ఉంటారు ఏమ అనరు అన్న పొగరుతో ఎవడు పడితే వాడు ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. “” అంటూ మండిపడ్డారు.