Pension: ప్ర‌భుత్వ ఉద్యోగం లేక‌పోయినా పెన్ష‌న్ వ‌చ్చే ప‌థ‌కం

best pension scheme for farmers

Pension: సాధార‌ణంగా పెన్ష‌న్ అనేది ప్ర‌భుత్వ ఉద్యోగులకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. మ‌రి ప్ర‌భుత్వ ఉద్యోగం లేని వారికి కూడా పెన్ష‌న్ రావాలంటే ఎలా? సింపుల్‌గా ఈ ప‌థ‌కాన్ని ఫాలో అయిపోండి.

అయితే.. ఈ ప‌థ‌కం కేవ‌లం రైతుల‌కు మాత్ర‌మే. వారి వ‌య‌సు కూడా 20 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.

నెల‌కు ఆదాయం కూడా రూ.15000 వ‌ర‌కు ఉండాలి

ఆల్రెడీ NPS, EPFO, ESICలో న‌మోదు అయివున్న‌వారు అర్హులు కారు.

అన్నీ అర్హ‌తలు క‌లిగున్న‌వారు ఈ ప‌థకాన్ని తీసుకుంటే 60 ఏళ్లు వ‌చ్చేస‌రికి నెల‌కు రూ.3000 పెన్ష‌న్ వస్తుంది.

ఇందుకోసం అర్హ‌త క‌లిగిన రైతులు నెల‌కు రూ.55 నుంచి రూ.200 వ‌రకు పొదుపు చేసుకోవాలి.

న‌మోదుకు కావాల్సిన డాక్యుమెంట్స్

ఆధార్ కార్డు

ఓట‌ర్ ఐడి లేదా రేష‌న్ కార్డు

ప‌ర్మ‌నెంట్ అడ్రెస్ ప్రూఫ్‌

బ్యాంక్ పాస్‌బుక్

మొబైల్ నెంబ‌ర్ (ప‌నిచేస్తుండాలి)

పాస్‌పోర్ట్ సైజ్ క‌ల‌ర్ ఫోటో

ఈ డాక్యుమెంట్ల‌తో మీ ద‌గ్గ‌ర్లోని ఈసేవా కేంద్రాల‌కు వెళ్తే వారు అన్ని వివ‌రాల‌ను చెప్తారు.