Badlapur Rape Case: షాకింగ్.. పోలీస్ కస్టడీలో నిందితుడి కాల్పులు
Badlapur Rape Case: బద్లాపూర్ అత్యాచార ఘటనలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు అక్షయ్ శిందే పోలీస్ కస్టడీలో తనపై తాను కాల్పులు జరిపాడు.. ఇద్దరు కానిస్టేబుల్స్ అక్షయ్‌ను వేరే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో వారి నుంచి తుపాకీ లాక్కుని తనని తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. కలకత్తా మర్డర్ కేసు జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే బద్లాపూర్ సంఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇద్దరు స్కూల్ బాలికలను అక్షయ్ లైంగికంగా వేధించాడు. వారి యోని భాగాలు ఛిద్రమయ్యేలా చేసాడని మెడికల్ పరీక్షల్లో తేలింది. నిందితుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.