Jani Master Case: జానీ వెన‌క బ‌న్నీ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌

Jani Master Case: ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ రేప్ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న వ‌ద్ద ఎప్ప‌టి నుంచో కొరియోగ్ర‌ఫీ నేర్చుకుంటున్న ఓ యువ‌తిని మైన‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి రేప్ చేస్తున్నాడన్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై పోక్సో కేసు న‌మోదైంది. ఇటీవ‌ల విచార‌ణ చేప‌ట్ట‌గా.. ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మే అని జానీ మాస్ట‌ర్ ఒప్పుకున్నారు. అయితే జానీ మాస్ట‌ర్ వెన‌క అల్లు అర్జున్ ఉన్నాడ‌ని.. పుష్ప సినిమాకు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హరించినందుకు ఆయ‌న్ను కాపాడే యత్నం చేస్తున్నార‌ని కొంద‌రు యూట్యూబ్ బ్యాచ్ దారుణ‌మైన థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టేస్తున్నారు. దీనిపై పుష్ప నిర్మాత ర‌వి శంక‌ర్ స్పందించారు.

జానీ మాస్ట‌ర్ ఉన్న స‌మ‌యంలోనే ఆ అమ్మాయి పుష్ప సినిమాకు అడిష‌న‌ల్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసింద‌ని.. త‌మ‌కు కానీ అల్లు అర్జున్‌కి కానీ జానీ మాస్ట‌ర్‌తో కేవ‌లం ప్రొఫెష‌న‌ల్ ట‌చ్ ఉందే త‌ప్ప వారి వ్య‌క్తిగ‌త జీవితాల గురించి మాత్రం త‌మ‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. అందుకే ఆ అమ్మాయికి గీతా ఆర్ట్స్ త‌ర‌ఫున అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని బ‌న్నీ మాటిచ్చార‌ని.. కొంద‌రు యూట్యూబ్ బ్యాచ్ చేస్తున్న త‌ప్పుడు వీడియోల వ‌ల్ల ఇలాంటి రూమ‌ర్స్ వ‌చ్చాయే త‌ప్ప ఏ ప‌త్రిక‌లు, వెబ్‌సైట్ల‌లో కానీ ఇలాంటి చెత్త వార్త‌ను చూడ‌లేద‌ని స్ప‌ష్టం చేసారు.