Garikapati: కల్కిపై గరికపాటి విమర్శలు
Garikapati: ప్రముఖ ఉపన్యాసకులు గరికపాటి నరసింహారావు కల్కి సినిమాపై విమర్శలు గుప్పించారు. తనకు నచ్చని రాజకీయ పార్టీలపై, సినిమా హీరోలపై ఎలాంటి మొహమాటం లేకుండా విమర్శలు చేస్తుంటారు గరికపాటి. తాజాగా కల్కి సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
“” గరుడు ఎవరో తెలీకపోతే కల్కి సినిమాలో చూపించినవాడే గరుడు. మనమేం చేస్తాం? సినిమాలు ఏది చూపిస్తే అది. మహాభారతంలో ఉన్నది వేరే కల్కి సినిమాలో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు హీరోలైపోయారు. అర్జునుడు, కృష్ణుడు విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థంకావడంలేదు. బుర్ర పాడైపోతోంది. పైగా చాలా భారతం తెలిస్తే అర్థమవుతుంది. అశ్వత్థామే కర్ణుడిని పలుమార్లు కాపాడాడు. కర్ణుడు ఒక్కసారి కూడా అశ్వత్థామను కాపాడలేదు. ఆ అవసరం లేదు. ఎందుకంటే అశ్వత్థామ మహా వ్యక్తి. పైగా ఆచార్యపుత్రా ఆలస్యమైనదా అంటారు. ఆ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఏముంది.. ఓ 20 రూపాయలు డబ్బులు ఎక్కువిస్తే ఏది పడితే అది రాసేస్తారు “” అని వెల్లడించారు.