IND vs BAN: మ‌లింగాలా ఫీలైపోతున్నాడు.. కోహ్లీ స్లెడ్జింగ్ వైర‌ల్

virat shakil al hasan news

IND vs BAN: ఇండియా బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ స్పిన్న‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్‌పై స్లెడ్జింగ్ చేయడం వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో ష‌కీబ్ ప‌ట్ల కోహ్లీ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. ఎందుకంటే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ ష‌కీబ్ యోర్క‌ర్లు వేస్తూనే ఉన్నాడు. దాంతో కోహ్లీకి ఒళ్లు మండింది. ల‌సిత్ మలింగా వ‌చ్చాడు యోర్క‌ర్ల మీద యోర్క‌ర్లు వేయ‌డానికి అని కామెంట్ చేసాడు. అది విని ష‌కీబ్ షాక‌య్యాడు. షకీబ్‌కి కూడా ఒళ్లుమండి కోహ్లీని ఏదో తిట్టాడు. కానీ అది స‌రిగ్గా వినిపించ‌లేదు.

దాదాపు 9 నెల‌ల త‌ర్వాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. రెండు ఇన్నింగ్స్‌లో కేవ‌లం 23 ప‌రుగులే తీసాడు. ఆ త‌ర్వాత లెగ్ బిఫోర్ వికెట్ వ‌ల్ల ఔట్ అయ్యాడు. కానీ ఆ స‌మయంలో కోహ్లీ డీఆర్ఎస్ తీసుకోక‌పోవ‌డంతో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం వైర‌ల్‌గా మారింది.