Devara: ఏపీలో టికెట్ల ధర పెంపు
Devara: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవర సినిమాకు బంపర్ బొనాంజా ప్రకటించింది. దేవర సినిమాకు గానూ టికెట్ల ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.
సింగిల్ స్క్రీన్స్‌లో అప్పర్ క్లాస్ టికెట్లకు రూ.110 హైక్ ఇవ్వగా.. లోవర్ క్లాస్‌కు రూ.60 హైక్ ఇచ్చింది. మల్టీప్లెక్సులకు రూ.135 హైక్ ఇచ్చింది. అంతేకాదు రిలీజ్ తేదీ రోజు 6 షోలకు పర్మిష్ ఇవ్వగా రిలీజ్ అయిన తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని వెల్లడించింది. రిలీజ్ డే రోజు అర్థరాత్రి 12 గంటల షోకు కూడా పర్మిషన్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో సినిమా రంగానికి గడ్డు కాలం గడిచింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తెలుగు సినిమా నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.