Jani Master Case: కేసులో ట్విస్ట్

Jani Master Case twist

Jani Master Case: కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. చేసిన త‌ప్పును అంగీక‌రిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్న నేప‌థ్యంలో నిన్న రాత్రి జానీ భార్య అయేషా బాధితురాలి ఇంటికి వెళ్లి గొడ‌వ చేసారు. బాధితురాలిపై దాడ చేసేందుకు య‌త్నించారు. దాంతో అయేషాతో పాటు మ‌రో ఇద్ద‌రిని ఈ కేసులో నిందితులుగా చేర్చే అవ‌కాశం ఉంద‌ట‌. ఎందుకంటే.. జానీ మాస్ట‌ర్ ఆ అమ్మాయి మైన‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి వేధిస్తుండ‌గా.. ఇవ‌న్నీ తెలిసిన అయేషా త‌న భ‌ర్త చెప్పిన‌ట్లు వినాల‌ని లేక‌పోతే చంపేస్తాన‌ని ఆ అమ్మాయిని బెదిరించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది.