Ravindranath Reddy: తల్లికి వందనం.. తండ్రికి వంద మద్యం
Ravindranath Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం వంటి పథకాలతో ప్రజలను ఊరించి అధికారంలోకి వచ్చారని.. ఊహించినట్లుగానే పథకాలు అమలు చేయడంలేదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత రవీంద్రనాథ్ రెడ్డి. తల్లికి వందనం అన్నారు కానీ తండ్రికి మాత్రం వందకే మద్యం ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మంది నుంచి పెన్షన్లు లాక్కుని వాటినే కొత్త పెన్షన్ పథకంలో అడ్జస్ట్ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. మూడు సిలిండర్లను దీపావళికి ఇస్తామంటున్నారని అందులో ఎంత నిజం ఉందో మున్ముందు తెలుస్తందని అన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పి మొన్న ఈ వంద రోజుల్లోనే 20 వేల కోట్ల రూపాయలు అప్పు చేసారని.. మున్ముందు ఇంకెన్ని కోట్లు చేస్తారో అని ఆ భారం ఎక్కడ తమపై పడుతుందోనని ప్రజలు భయపడుతున్నట్లు తెలిపారు.