Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్
Jani Master: పోలీసుల అదుపులో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారు. కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్‌తో కలిసి పనిచేసిన ఓ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు ఆయనపై పోక్సో కేసు పెట్టారు. నిన్న గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు జుడిషియల్ కస్టడీ విధించారు.
అయితే.. విచారణలో జానీ మాస్టర్ తన నేరాన్న అంగీకరించినట్లు తెలుస్తోంది. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2019లో జానీకి బాధితురాలు పరిచయం అయ్యింది. 2020లో జానీ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తొలిసారి జానీ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి జరిగింది. విషయం బయటికి వస్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడట. జానీ భార్య కూడా బెదిరింపులకు పాల్పడినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.