India: ప్రతి 32 గంటలకు భర్తలను చంపేస్తున్నారట!
Delhi: భారతదేశంలో(India) ఆడవారి(women) కోసం ఉన్నన్ని చట్టాలు (laws) మగవారికి లేవనే చెప్పాలి. ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో మహిళల సంరక్షణకు ఎన్నో చట్టాలను ప్రవేశపెట్టారు. అయితే కొందరు ఆడవారు తమకున్న స్వేచ్ఛను అడ్వాంటేజ్‌గా తీసుకుంటూ మగవారిపై తప్పుడు కేసులు పెట్టడంలాంటివి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయనే చెప్పాలి.
అయితే భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన పలు క్రైం రిపోర్టులు, సర్వేల ఆధారంగా ఓ షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ప్రతి 32 గంటలకు ఓ భార్య.. భర్తను హతమారుస్తోందట. దాంతో గృహహింస చట్టాలు ఆడవారికి మాత్రమే కాకుండా మగవారికి కూడా సమానంగా ఉండాలని ఓ ప్రముఖ మహిళా జర్నలిస్ట్ డిమాండ్ చేస్తున్నారు. మహిళల కమిషన్(women’s commission) మాత్రమే కాకుండా పురుషులకు కూడా ఓ కమిషన్(men’s commission) ఏర్పాటుచేయాలని అంటున్నారు.
మన దేశంలో భార్యల పట్ల భర్తలు అమానవీయంగా ప్రవర్తిస్తే సెక్షన్ 498A కింద శిక్షిస్తారు. ఇదే సెక్షన్ పెళ్లైన మగవారికి కూడా ఉండాలట. 2022లో మాత్రమే 271 మర్డర్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అవన్నీ భార్యలు భర్తలను చంపిన కేసులేనని షాకింగ్ విషయాలు వెల్లడించారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ 271 కేసుల్లో 218 కేసులు పెళ్లైన మహిళలు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలను చంపేసినవేనట. బాధాకరమైన విషయం ఏంటంటే.. భార్యలు భర్తలను చంపే ఘటనలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రైమ్ టైం న్యూస్ కవరేజ్ లేదు. అదే భార్యలను చంపిన భర్తల కేసుల విషయంపై మూడు, నాలుగు రోజుల పాటు కవరేజ్ ఉంటుంది.
ఇవన్నీ ఒక ఎత్తైతే.. మహిళల నుంచి పురుషులకు రక్షణ కల్పించే చట్టం ఇప్పుడేమీ అవసరం లేదని భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పడం మరో ఎత్తు. అయితే ఈ వ్యాఖ్యలు చేసింది ఓ మహిళా జడ్జి కావడం కొసమెరుపు.