Jani Master Wife: ఆ అమ్మాయి ఎంతో మందితో పడుకుంది
Jani Master Wife: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య అయేషా షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. బాధితురాలికి చాలా మంది కొరియోగ్రాఫర్లతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. ఎంతో మందితో పడుకుందని అన్నారు. ఈ విషయం ఇతర కొరియోగ్రాఫర్ల భార్యలకు తెలీడంతో వారు ఆ అమ్మాయిని బెదిరించారని అన్నారు. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కాగా.. ఈరోజు ఆయన్ను గోవాలో పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జానీ భార్య అయేషా పోలీస్ స్టేషన్లో నానా రచ్చ చేసారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చారు.
“” నా భర్త మంచివాడు. ఆ అమ్మాయి నా భర్తతో చాలా చనువుగా ఉండాలని అనుకునేది. ఈ విషయాన్ని నాకు తెలిసిన వారు ఫోన్ చేసి ఏంటి వదినా ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తోంది అని చెప్పారు. జానీ మాస్టర్ మామూలుగానే ఉంటున్నా కూడా ఆ అమ్మాయి జానీ మాస్టర్ అటెన్షన్ తనపైనే ఉండాలని మీద మీద పడిపోతోందని చెప్పారు.
శర్వానంద్ సినిమాలో జానీ మాస్టర్‌కు కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తే.. ఆ అమ్మాయిని తీసుకుని మరీ జానీ మాస్టర్ విదేశాలకు షూటింగ్‌కి వెళ్లారు. సాంగ్ మొత్తం కొరియోగ్రాఫ్ చేసింది మాస్టర్ అయితే.. కానీ పాపం ఆ అమ్మాయికి క్రెడిట్ ఇస్తే అవకాశాలు వస్తాయని ఆ అమ్మాయి పేరే క్రెడిట్స్‌లో వేయించాడు. జానీకి జాతీయ అవార్డు వచ్చినప్పటి నుంచి కావాలనే టార్గెట్ చేస్తున్నారు. 16 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు అంటోంది. మరి ఆధారాలు ఉన్నాయా? 16 ఏళ్ల నుంచి లైంగికంగా వేధిస్తుంటే జానీ మాస్టర్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం అని ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది? పైగా అలా చెప్పేటప్పుడు కూడా ఆమె కళ్లలో భయం కానీ ఏమంటారో అని బెరుకు కానీ లేదు.
ఆ అమ్మాయి వాళ్ల అమ్మ ఒత్తిడితో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. ఆ అమ్మాయి ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ల అమ్మ ఆడ జాతికే కళంకం. ఒక సైడ్ స్టోరీ విని లవ్ జిహాద్ అని ఎలా అనేస్తారు? అంతెందుకండీ.. నా పేరు సుమలత. నన్ను మా అత్తింటివారు అయేషా అని పిలుస్తారు. అలాగని జానీ నాకు ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. పండుగలకు వ్రతాలకు నేను మా పుట్టింటికి వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకుంటాను. నేను బయటికి వెళ్లేటప్పుడు బుర్కా కూడా వేసుకోను. అలాంటప్పుడు మీరు లవ్ జిహాద్ అని ఎందుకు అంటారు? ఆ అమ్మాయి ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని వాళ్ల అమ్మ చిన్న దుస్తులు వేసుకుని అందరి దగ్గరికి వెళ్ళు అని మరీ పంపిస్తుంది. ఆ అమ్మాయికి ముంబైలో కొరియోగ్రాఫర్స్ యూనియన్‌లో కార్డు ఇప్పించింది కూడా జానీనే. ఇంత చేసిన జానీపై ఇంతటి ఆరోపణలు చేస్తోందంటే ఆ అమ్మాయిని ఏమనాలి? నా భర్త భారతదేశం కోసం ప్రాణాలు ఇస్తారు. నిజంగానే ఆ అమ్మాయిపై జానీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని నిరూపిస్తే నేను జానీని వదిలేసి వెళ్లిపోతా. “” అని వెల్లడించారు.