Sajjala Jagan: జిల్లా ఏదైనా.. స‌జ్జ‌ల ఉండాల్సిందే

Sajjala Jagan meeting

Sajjala Jagan:  సాధార‌ణంగా ఒక జిల్లాకు సంబంధించిన నేత‌ల‌తో కానీ కార్య‌క‌ర్త‌ల‌తో కానీ ఆ పార్టీ అధినేత స‌మావేశం ఏర్పాటు చేయాల‌నుకుంటే అదే జిల్లాకు చెందిన ఇన్‌ఛార్జిని కూడా పిలుస్తారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్టైలే వేరు. ఏ జిల్లా నేతలతో సమావేశం అయినా.. అక్క‌డ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండి తీరాల్సిందే. ఇవాళ వైసీపీ పార్టీ కార్యాలయంలో విజయనగరం జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో అస‌లు సంబంధంలేని స‌జ్జ‌ల కూడా పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.