Ambati Rambabu About TDP: నాణ్యమైన మద్యం.. అందరూ తాగచ్చా? ఏం కాదా?
Ambati Rambabu About TDP: ఎవరైనా అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని అంటారు కానీ నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని అనడం తొలిసారి ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తున్నానని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రాంబాబు. ఇంతటి నాణ్యమైన మద్యం తాగితే ఆరోగ్యం దెబ్బ తినదా అని సెటైర్లు వేసారు.
“” చంద్రబాబు నాణ్యమైన మద్యం ఇస్తారట. అంతటి నాణ్యమైన మద్యం తాగితే ఏం కాదా మరి? అందరూ తాగచ్చా? మద్యం మద్యమేగా. మరి మద్యం సీసాలపై మద్యం ఆరోగ్యానికి హానికరం అనే స్టిక్కర్లను ఉంచడం ఎందుకు. తీసేయచ్చు కదా. ఆ స్టిక్కర్ బదులు ఎంతైనా తాగండి అని పెట్టించండి నాణ్యమైన మద్యం సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయి? నేను రాజకీయాల్లోకి అప్పుడప్పుడే వచ్చిన రోజుల్లో మా స్లోగన్ ఏంటో తెలుసా? నారా వారి సారా పాలన డౌన్ డౌన్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాల మద్యం స్కాంలు చేసి కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఇది అక్షర సత్యం. మేం అధికారంలో ఉన్నప్పుడు మేం సప్లై చేసిన మద్యం విషంతో సమానమన్నారు. మా మద్యం తాగితే చచ్చిపోతారు అని చెప్పారు. మరి ఇప్పుడు నాణ్యమైన మద్యం ఇస్తాం. జగన్ ఇచ్చే మద్యం చాలా ప్రమాదకరం, ఖరీదైనది అని తప్పుడు ప్రచారం చేసారు.
Ambati Rambabu About TDP: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు సుమారు 4380 మద్యం దుకాణాలు ఉండేవి. మేం అధికారంలోకి వచ్చాక మద్యాన్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మే కార్యక్రమం చేసాం. దానికి 2934 దుకాణాలను ప్రభుత్వం ఓపెన్ చేసింది. మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా లేక ప్రభుత్వం అమ్మితే వస్తాయా? ప్రైవేటీకరణ చేస్తే కదా వచ్చేది. 2934 షాపులు మేం మెయింటైన్ చేస్తే మీరు 4380 షాపులు పెట్టి దోచుకుని మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రేపు షాపులు 7000 వరకు పెరుగుతాయేమో. సిండికేట్ మద్యం అమ్మి డబ్బులు కాజేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు పరిపాలనలో అందరు సిండికేట్ చేసారు. ఆ సిండికేట్లు 25 రూపాయల బాటిల్ అని చెప్పి షాపులో 35 అమ్మేవారు. అందరూ తెలుగు దేశం కార్యకర్తలు పంచుకునేవారు. ఇవాళ కూడా అలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు.
పైగా నిన్న ఏదో కేబినెట్ మీటింగ్ జరిగిందట. చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన ఈనాడు వాళ్లు రాసిన వార్త. జగన్ భార్య భారతికి సాక్షి పత్రిక ద్వారా దోచిపెట్టారు అని శీర్షిక పెట్టారు. భారతి ఛైర్మన్, డైరెక్టర్ కూడా కాదు. కాకపోతే కార్యకలాపాలు చూస్తారు. సాక్షి అనే పత్రిక గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షి పత్రికను తీసుకురావాలని తాపత్రయపడి తీసుకొచ్చారు. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను గుప్పెట్లో పెట్టుకుని రోజూ ఒక కథనం రాసి ప్రజల ముందుకు పంపి విష ప్రచారాలు చేస్తున్నారన్న విషయం తెలుసుకుని సాక్షి పత్రికను ప్రారంభించాలని అనుకున్నారు. నిష్పక్షపాతంగా వార్తను ప్రజలకు ఇవ్వాలని సాక్షి ఏర్పాటుచేసారు. సాక్షి పుట్టుకతోనే దానిని తొక్కేయాలని చంద్రబాబు, రామోజీ రావు కుట్రలు పన్నారు. ఎందుకంటే సాక్షి ఉంటే ఎక్కడ రామోజీ, చంద్రబాబు నాటకాలు బయటపడతాయో అని భయం. “” అని వెల్లడించారు రాంబాబు.